నూతన దంపతులను దీవించిన ఎమ్మెల్యే వేముల
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం రోజున ఫంక్షన్ హాల్లో జరిగిన చిట్యాల మున్సిపాలిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి సైదులు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వధూవరుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని, కుటుంబ సభ్యులకు అన్ని శుభాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నూతన వధూవరులను దీవించిన వారిలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎద్దుల పూరి కృష్ణ, జడల చిన్న మల్లయ్య, జనగామ రవీందర్, చిన్న కాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
