Polling | మే 4న స్వీట్లు పంచుతాం..

Polling | మే 4న స్వీట్లు పంచుతాం..
Polling | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్లో ఇవాళ తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణానగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల 29న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
మే 4న బెంగాల్‌లో మిఠాయిలు, ఝాల్ మురీ పంచుతామని పేర్కొన్నారు. తాను ఇటీవల ఝాల్ మురీ తిన్నానని, అయితే ఆ ఘాటు మాత్రం టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
