- హైదరాబాద్ అనుభవం నా జీవితంలో మరపురానిది
- అవకాశం వస్తే మళ్ళీ హైదరాబాద్ వస్తా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మిస్ వరల్డ్ 2025 విజేత ఒపల్ సూచత (థాయిలాండ్). హైదరాబాద్ హోటల్ ట్రిడెంట్ లో ఆమె మాట్లాడుతూ మిస్ వరల్డ్ నిర్వహనకు ప్రభుత్వం అందించిన సపోర్ట్ కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. ఇంత అద్భుతమైన అనుభవం పొందడం నా జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం, అని ఆమె అన్నారు.
థాయిలాండ్‌కు ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్ క్రోన్ అని ఈ క్రౌన్ గెలుచుకోవడం నాకు గర్వకారణం మాత్రమే కాక, ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను అని ఆమె తెలిపారు. నా దేశ ప్రజలతో పాటు, హైదరాబాద్‌లో మా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను,” అని ఆమె చెప్పారు. క్రోన్ ప్రకటంచిన క్షణం ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని ఆమె చెప్పారు. లక్ష్యం నిర్ధారించుకొని కష్టపడితే తప్పకుండ విజయం సాధిస్తారని ఆమె అన్నారు. ఇది నా ఒక్క దాని గెలుపు కాదని ప్రతి కంటెస్టెంట్ అదేవిధంగా వారి పర్పస్ గెలుపు అని ఆమె తన గెలుపును అభివర్ణించారు.
బ్యూటీ విత్ పర్పస్ – సేవా కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తా
నేను గత మూడేళ్లుగా థాయిలాండ్‌లో బ్రెస్ట్ కాన్సర్ అవగాహనపై పని చేస్తూ ఫండ్ రైసింగ్ చేస్తున్నాని అన్నారు. ఇక పై తన పర్పస్ ప్రాజెక్ట్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్ పర్పస్ ప్రాజెక్ట్స్ పై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తానని అదే మహిళా సాధికారత, సమస్యలపై పనిచేస్తానన్నారు. తన సేవకార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించునున్నట్లు ఆమె పేరక్కొన్నారు.
- సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణ
తెలంగాణ ప్రజల ఆతిథ్యం మార్వలేనిదని, వారు చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికి మదిలో నిలిచిపోతాయాన్నారు. ఇక్కడి కలలు, సంప్రదాయాలు, డాన్స్, మ్యూజిక్ ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. రామప్ప, చార్మినార్ నిర్మాణం విస్తుపోయేలా చేసిందని ఇది కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం అని ఆమె అన్నారు. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో బాగుందని బాహుబలి సెట్ నచ్చిందని అన్నారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘She Teams’ గొప్ప ఆవిష్కరణ. మహిళలు విద్య, వైద్య, ఐటీ, మొదలైన రంగాల్లో ఆవిష్కరణలు అభినందనీయం అన్నారు.
హైదరాబాద్ అనుభవం జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం
“హైదరాబాద్‌లో గడిపిన ప్రతి క్షణం తనకు మాత్రమే కాదు, తన తోటి కంటెస్టెంట్స్‌కు కూడా మరచిపోలేని అనుభవం అన్నారు. అవకాశమిస్తే మళ్లీ హైదరాబాద్ తప్పకుండ వస్తానని మిస్ వరల్డ్ ఒపల్ సూచత అన్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఎయిర్‌పోర్ట్‌లో దిగిన క్షణం నుంచే ప్రభుత్వం అందించిన హాస్పిటాలిటీ అద్భుతంగా ఉంది. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించారాని వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించిన తీరు అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు. మిస్ వరల్డ్ తరఫున, థాయిలాండ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఒపల్ సూచత చెప్పారు.