అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం

అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం

కార్మికులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం

చిట్టినగర్, ఆంధ్రప్రభ : అగ్నిమాపక వారోత్సవాలు -2026 ఐదవ రోజు శనివారం ఉదయం కొత్తపేట అగ్నిమాపక అధికారి తలసీల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది బాలాజీ స్వీట్ అండ్ ఫుడ్ వారి కార్కానాలో కార్మికులకు అగ్ని ప్రమాదాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్ లు, సుమన్ గ్యాస్ ఏజెన్సీ లను సందర్శించి అక్కడ ఉన్న వారి కి అగ్నిప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భముగా శ్రీ బాలాజీ ఫుడ్స్ కబేల ఇండస్ట్రియల్ ఏస్టేట్లో గ్యాస్ వాడకంపై అవగాహన కల్పించారు. సుమన్ ఏజెన్సీస్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గోడౌన్ లోపల భాగం యందు కింద ఏర్పరిచిన వెంటిలేటర్స్ పనితనం పరిశీలించారు. సిలిండర్లు తీసుకుని వెళ్ళుటకు వచ్చిన ప్రజలకు గ్యాస్ బండ చెక్ చేసుకుని విధానాన్ని తెలియజేశారు. అనేక పెట్రోల్ బంకులకు సందర్శించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వాటిలో జి ఎస్ ఆర్ వనదుర్గ ఫిల్లింగ్ స్టేషన్, గొల్లపూడి ఎమ్మెస్ అరుణ శ్రీ ఫీలింగ్ స్టేషన్ , గొల్లపూడి వరలక్ష్మి ఫీలింగ్ స్టేషన్ కబేల , మారుతి ఫీలింగ్ స్టేషన్ కబేల యందు సిబ్బంది కి వాహనదారులకు కూడా అగ్ని ప్రమాదాలను నివారించే నిమిత్తం అనేక సూచనలు చేశారు. అవి వాహనాలకు ఆయిల్ నింపేటప్పుడు తీసుకు వలసిన జాగ్రత్తలు తెలిపారు. పెట్రోల్ నింపేప్పుడు ఇంజన్ ఆపు చేయాలని , సెల్ ఫోన్ మాట్లాడకూడదు అని తెలిపారు.

అలాగే ఫోన్ పే చేసేముందు వాహనాన్ని ముందు పార్క్ చేసి పెట్టి తర్వాత ఫోన్ పే చేయవలె నని తెలియజేశారు. పెట్రోల్ బంక్ లో కార్బన్డయాక్సైడ్ ఎక్సటింగ్ విషెర్ వంటి అగ్ని మాపక పరికరాల ఎలా వినియోగించా లో సిబ్బంది కి అవగాహన కల్పించారు. పెట్రోల్ బంక్ ఆవరణలో అగ్నిమాపక వారోత్సవాలు బ్యానర్ ప్రదర్శించి, అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు.

Leave a Reply