క్లస్టర్-5లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

క్లస్టర్-5లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: తిరుపతి పార్లమెంట్ క్లస్టర్-5 పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైబ్రిడ్ మహానాడు రెండో రోజు కార్యక్రమాల్లో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
క్లస్టర్-5 పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన హైబ్రిడ్ మహానాడులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానీయుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాల వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
