Nifty 89 points | ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు..

Nifty 89 points | ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు..
Nifty 89 points | ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లకు ఊరట
ముడిచమురు ధరలు తగ్గడంతో స్టాక్ మార్కెట్ల జోష్
Nifty 89 points | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధంగా చేపట్టాలనుకున్న సైనిక దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొంత చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గగా.. భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

సానుకూల అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 364 పాయింట్లు లాభపడి 75,679 వద్ద ట్రేడైంది. అలాగే నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 23,739 స్థాయికి చేరింది. చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ స్థిరపడటం ఇన్వెస్టర్లలో భరోసా పెంచినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు 4.55 శాతం ఎగబాకగా, హెచ్ సీఎల్, టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, విప్రో షేర్లు 2 నుంచి 3.5 శాతం వరకు లాభపడ్డాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం ఐటీ కంపెనీలకు అనుకూలంగా మారింది. అదానీ గ్రూప్ షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి.
మరోవైపు హిందాల్కో ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.47 శాతం దూసుకెళ్లగా, కెమికల్స్ రంగం కూడా లాభపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా సానుకూలంగా కదిలాయి.

ట్రంప్ తీసుకున్న తాత్కాలిక శాంతి నిర్ణయం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 107 డాలర్ల వద్దకు చేరడం భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే భౌగోళిక రాజకీయ పరిణామాలు ఎప్పుడైనా మారే అవకాశం ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
CLICK HERE TO READ MORE : Rs.820 | హైదరాబాద్‌లో ఒక్కరోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు
