కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..

  • రైతులకు ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్ సూచన

కడెం, ఆంధ్రప్రభ : రైతులు తమ పంట ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగేల భూషణ్ సూచించారు.

మంగళవారం కడెం మండలంలోని మాసాయిపేట గ్రామంలో పాండవపూర్ పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆర్. శైలజ రమేష్‌రావు, మాసాయిపేట గ్రామ ఇంచార్జ్ సర్పంచ్ ఎట్టెం రాజవ్వ, ఎర్రన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూషణ్ మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే సరైన ధర లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ పి. రాజేశ్వర్‌రెడ్డి, కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కె. రాజేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply