10Years | ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

10Years | ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
- మరో ఏడాది సడలింపు పొడిగించిన ప్రభుత్వం
10Years | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు కీలక ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులకు అవకాశం కలగనుంది.
వయోపరిమితి సడలింపును మరో ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
