NEWS@12:00 P.M | 12 జూలై 2026 ముఖ్యాంశాలు
నాన్న వస్తారని ఎదురుచూస్తున్న పిల్లలు Andhra Prabha Sad News
వియత్నంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్‌బోటు బోల్తా పడటంతో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెలువడగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
మృతుల్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మరణంపై భారత విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం నుంచి అధికారిక ధృవీకరణ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్రకీలాద్రి, కనకదుర్గ నగర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి.
విశాఖలో అలజడి Andhra Prabha Top News
శాఖ సాగర తీరంలో తెల్లవారుజామున 5:05:46 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న నగర వాసులు ఒక్కసారిగా వచ్చిన ఊపునకు కంగుతిని, ప్రాణభయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు . అప్పుఘర్, పెద వాల్టేరులో కపించిన భూమి కంపించింది. .ఈ భూకంప కేంద్రం బంగాళాఖాతంలో, భూ అంతర్భాగంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దీని ప్రభావంతో విశాఖలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీ తదితర పరిసర ప్రాంతాల్లోని ప్రజలు స్పష్టమైన కంపనాలను అనుభవించారు. అయితే, భూకంప తీవ్రత 4.5 మేరకే పరిమితం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు
నేడు హైదరాబాద్ ఛాంపియన్స్-ఖమ్మం ఏసెస్ ఫైనల్ పోరు..
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీకి నేడు తెరపడనుంది. హైదరాబాద్ ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
