Commercial LPG Price Hike | పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు

Commercial LPG Price Hike | పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు

వ్యాపార వర్గాలపై అదనపు భారం

Commercial LPG Price Hike | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా ధరల సవరణతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై అదనపు భారం పడనుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.

తాజా నిర్ణయం ప్రకారం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.42 పెరిగి రూ.3,113.50కు చేరింది. కోల్‌కతాలో రూ.53.50 పెరుగుదలతో సిలిండర్ ధర రూ.3,255.50కు చేరింది. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (ఎఫ్‌టీఎల్) సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగి ఢిల్లీలో రూ.821.50గా నిర్ణయించారు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలోనే కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచిన చమురు కంపెనీలు, నెల వ్యవధిలోనే మరోసారి ధరలు పెంచడం గమనార్హం.

ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిల్వలను తగిన స్థాయిలో ఉంచుతున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. కనీసం 30 రోజుల అవసరాలకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు నిర్వహించాలని చమురు మార్కెటింగ్ సంస్థలకు సూచించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, సహజ వాయువు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply