ప్రజల కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్
ప్రజల కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్
- ఆదరించి.. రాష్ట్రంలో అధికారం ఇవ్వాలి..
- అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలే తమ ఎజెండగా ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రక్షణ సేన అని, రాష్ట్రంలో ప్రజలు తమను ఆశీర్వదించి అధికారం ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం నుంచి పెద్దపల్లి పర్యటనకు వచ్చిన కవితకు పార్టీ శ్రేణులు శాంతినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పెద్దపల్లి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీతో కవితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం సమీపంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం పని చేయడమే తమ లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. తమ పార్టీకి ప్రజలు అండగా నిలిచి ఆదరించాలని కోరారు. అనంతరం అయ్యప్ప ఆలయ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ సలేంద్ర కొమురయ్య, నాయకులు బాలాజీరావుతోపాటు పలువురు పాల్గొన్నారు.
