అంబేద్కర్‌కు ఘన నివాళులు..

అంబేద్కర్‌కు ఘన నివాళులు..
విజయవాడ, ఆంధ్రప్రభ : మంగళవారం నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారత రత్న బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవం సందర్భంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులతో కలిసి డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
