ప్రకృతి కాన్వాస్ పై కనువిందు


ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : మండు వేసవిలో ఆదిలాబాద్ అడవిలో ప్రకృతి కాన్వాస్ పై కనువిందు చేసే కలర్ ఫుల్ మార్కు చిత్రమిది. మేకల గండి జాతీయ రహదారి లోయ పక్కనే ఈ కల్పవృక్షం చూపరులను అమితంగా ఆకట్టుకుoటోoది. వేసవిలో వెనకాల చెట్లన్నీ ఆకులు రాల్చి మోడు వారి నిర్జీవంగా కనిపిస్తుంటే.. ఈ ఇప్ప చెట్టు మాత్రం పైన లేత ఆకుపచ్చ వర్ణం, కింది భాగంలో లేత ఎరుపు వర్ణాన్ని దాల్చి నీడ నిస్తోంది. అటుగా వెళ్లేవారు ఈ చెట్టు కింద సేద‌తీరున్నారు.

మధుక లొంగిఫోలియ
వృక్ష శాస్త్రంలో మధుక లొంగిఫోలియ శాస్త్రీయ నామం కలిగిన ఇప్పచెట్టు సతిత హరిత జాతిగా 12 నెలలు పచ్చగానే కళకళలాడుతుంది. వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకొని వేసవిలో ఆకురాలే సీజన్ లో ముందుగా లేత చిగురు ఆకులు దాల్చుకొని మిగతా ఎండిన ఆకులన్నీ రాల్చుకుంటుంది. కల్పవృక్షంగా పేరు ఉన్న ఇప్ప చెట్లతో బోలెడు లాభాలు ఉన్నాయి. వేసవిలో మెండుగా కాసే ఇప్ప పువ్వు నేలకు రాలగానే జింకలు, ఎలుగుబంట్లు అక్కడ చేరి అనిత ఇష్టంతో ఆహారంగా తీసుకుంటాయి. సతత హరిత జాతిగా పేరున్న ఇప్ప వృక్షాలు సకల రోగ నివారిణిగా పనిచేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

లాభాలు

  • వేసవిలో ఇప్ప పువ్వు సేకరణ అడవి బిడ్డలకు ఆదాయ వనరుగా మారుతుంది.
  • మోతాదులో ఇప్పపువ్వు సారా తీసుకుంటే దగ్గు, కీళ్ల నొప్పులు, ఆయాసం తగ్గుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
    -ఇప్పపువ్వు నేరుగా తింటే వేసవిలో శరీరంలో వేడి తగ్గుతుంది.
  • ఇప్పపువ్వు లడ్డూ తో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతారు.
  • పిల్లలకు, బాలింతలకు బలవర్ధకమైన పోషక ఆహారం కూడా ఇదే.
  • ఇప్ప చెట్టు కలప, బెరడు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో అనాదిగా ఆదివాసి వైద్యులు పలు రకాల వ్యాధులకు విరివిగా వాడుతుంటారు.

Leave a Reply