విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
జన్నారం, ఆంధ్రప్రభ : విద్యార్థులంతా క్రీడల్లో రాణించాలని స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజిత్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని కళాశాల విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్ లను గురువారం ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాపురావు, సాయికుమార్, రవీందర్, వై.నాగేశ్వరా రావు,సీహెచ్ మోహన్, శశికళ, ఏ.దేవేందర్, డి. స్వరూప, బి. కరుణాకర్, ఎం. కుమారస్వామి, ఎన్.పాషా, శివరాం పాల్గొన్నారు.
