శ్రీనివాస్ రావు మృతితో విషాదం..

కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
కేసీఆర్ బావమరిది మృతి..
అల్వాల్‌లోని నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది, ఆయన సతీమణి శోభమ్మ సోదరుడు జోగినపల్లి శ్రీనివాస్ రావు మృతి చెందడంతో కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రావు గురువారం మృతి చెందారు. శ్రీనివాస్ రావు మృతి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్వాల్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శ్రీనివాస్ రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీనివాస్ రావు మృతి నేపథ్యంలో కేటీఆర్ తన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

https://twitter.com/KTR_News/status/2087806648639435195/video/1