మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమాకం……

గోరికొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. సుధానబోయిన ఓం ప్రకాష్ …..


రేగొండ, (గోరికొత్తపల్లి), ఆంధ్రప్రభ :
గోరికొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండలంలోని సుధానబోయిన ఓం ప్రకాష్ ని నియమిస్తూ గురువారం పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ… తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్ లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచనలతో అందరినీ కలుపుకొనిపోతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు, కష్టపడి పని చేస్తానని అన్నారు. గోరుకొత్తపల్లి మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే జిఎస్ఆర్ కి జిల్లా, మండల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.