ఎక్సైజ్ తనిఖీలలో గంజాయి స్వాధీనం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని కాటమయ్య నగర్ లో నిర్వహించిన తనిఖీలలో 24 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సీఐ దీపిక గురువారం తెలిపారు. తనిఖీలలో ఎస్సై నిరోషా, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుళ్లు గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సోమేశ్వర్, నాగేంద్రబాబు, మహేష్ పాల్గొన్నారని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కు పాదం మోపుతామని ఆమె హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృత తనిఖీలు నిర్వహించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
