అధునాతన టెక్నాలజీతో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు
- ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
- జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ: అధునాతన టెక్నాలజీతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కాంస్య ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. గురువారం ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ పనులు ఎమ్మెల్యే తాతయ్య, నెట్టెం రఘురాం లు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనులు పరిశీలించడం జరిగిందన్నారు కాంపౌండ్ వాల్ నిర్మాణం లైటింగ్ ఇతర ఏర్పాటు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్ కు ఒక విశిష్టమైన గుర్తింపు ఉందని ఆ పేరుకు తగ్గట్టుగానే నూతన నిర్మాణం ఆకర్షణీయంగా గౌరవప్రదంగా అధునాతన టెక్నాలజీతో ఆహ్లాదకర వాతావరణము లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కట్ట వెంకట నరసింహారావు, గింజుపల్లి రమేష్, ధూళిపాల లక్ష్మణరావు, వ్యానాల గోపీచంద్, కన్యబోయిన రామలక్ష్మి, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కళ్యాణ మురళి, కుంచపర్తి నాగేశ్వరరావు ,కళ్యాణం సూర్యప్రకాష్ అన్వర్ లు పాల్గొన్నారు.
