Jannaram పట్టా రద్దు చేయాలని ఆదివాసీల బైఠాయింపు
Jannaram పట్టా రద్దు చేయాలని ఆదివాసీల బైఠాయింపు
- అధికారుల జోక్యంతో శాంతించిన నిరసన.. జన్నారంలో ర్యాలీ
జన్నారం (Jannaram), ఆంధ్రప్రభ:
జన్నారం శివారులోని సర్వే నంబర్ 80లోని భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం బైఠాయింపు నిర్వహించారు.
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు స్థానిక బస్టాండ్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ, గోండుగూడెం గ్రామానికి చెందిన సోయం పారుబాయికి సంబంధించిన జన్నారం శివారులోని సర్వే నంబర్ 80 భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఆ పట్టా, అలాగే నాళా కన్వర్షన్‌ను రద్దు చేసి సంబంధిత భూమిని అసలైన ఆదివాసి మహిళకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం నేతలు తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమయంలో తహసిల్దార్ బక్కయ్య, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, స్థానిక ఎస్‌ఐ గుర్రం ఉదయ్ కిరణ్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

