Maripeda ఓటు హక్కు పరిరక్షణకు బీఎల్‌ఏలు కీలకం

Maripeda ఓటు హక్కు పరిరక్షణకు బీఎల్‌ఏలు కీలకం

  • ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే రామచంద్రునాయక్

మరిపెడ (Maripeda), ఆంధ్రప్రభ:

ఓటు హక్కు పరిరక్షణలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకర్ల నర్సిరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, ఎండి అవిజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అసలైన ఓటర్ల పేర్లు తొలగిస్తూ, డమ్మీ ఓట్లు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొందరు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మలచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమని తెలిపారు.

బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను సక్రమంగా పర్యవేక్షించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటరును గుర్తించి వారి హక్కును కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply