250square yards | ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం

250square yards | ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం

250square yards | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కె. కవిత విమర్శించారు.

ఇవాళ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘భూపోరాటం’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.

జులై 2న ఉద్యమకారులతో కలిసి ఉప్పల్ భగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామని కవిత ప్రకటించారు. ఈ భూపోరాటంలో యువత, మహిళలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply