పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నాయకులు డిమాండ్ చేశారు.
మంగళవారం చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ఆగస్టు 1న నిర్వహించనున్న “చలో హైదరాబాద్” మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీపీయూఎస్ మండల అధ్యక్షులు సట్లపల్లి మధు, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్ మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే పీఆర్సీని మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం, 317 బాధితులకు న్యాయం చేయడం, ఈహెచ్‌ఎస్‌ను వెంటనే అమలు చేయడం, ఉద్యోగులు–ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు శ్రీరాం రఘుపతి, గోపగాని భాస్కర్, కానుగుల రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
