వాణిజ్యం, ఇరాన్ యుద్ధంపై చర్చలు

వాణిజ్యం, ఇరాన్ యుద్ధంపై చర్చలు

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధ వారం బీజింగ్లో అడుగు పెట్టారు. ఆయనతో పాటు ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తో కూడిన బృందం కూడా ఉంది. దాదాపు దశాబ్ద కాలంలో ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడం, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో అంతంతమాత్రంగా ఉన్న వాణిజ్య సంధిని కొనసాగించడం, ఇరాన్తో యుద్ధం కారణంగా దెబ్బతిన్న ప్రజామోదాన్ని పెంచుకోవడం వంటి లక్ష్యాలతో ట్రంప్ చైనా పర్య టనకు వచ్చారు. ట్రంప్తోతో పాటు వచ్చిన సీఈఓలలో ప్రధానంగా చైనాతో వ్యాపార సమస్యలను పరిష్క రించుకోవాలని చూస్తున్న కంపెనీలకు చెందిన వారే ఉన్నారు.

ఎన్విడియా తన శక్తివంతమైన హెచ్ 200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్లను చైనాలో విక్రయించడానికి నియంత్రణ సంస్థల అనుమతి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ<br>
సీఈఓ జెన్సన్ హువాంగ్ను ట్రంప్ చివరి నిమిషంలో ఈ పర్యటనలో చేరాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. సీఈఓలను ఉద్దేశించి ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ చేసిన పోస్టులో ఈ మేథావులు తమ అద్భుతాలు సృష్టించేందుకు వీలుగా, అసాధారణమైన ప్రతిభ కలిగిన నాయకుడైన జిన్పింగ్ చైనాను తెరిచి ఉంచాలని కోరబోతున్నట్లు తెలిపారు.

ట్రంప్ పోస్ట్ గురించి చైనా విదేశాంత మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ మాట్లాడుతూ సహకారాన్ని విస్తరించడానికి, అస్థిర ప్రపంచంలో మరింత స్థిరత్వం, నిశ్చయతను నింపడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని అన్నారు. ట్రంప్ గురు, శుక్రవారాలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో జరిపే సమావేశాలలో ది గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో ఘన స్వాగతం, యునెస్కో వారసత్వ ప్రదేశమైన టెంపుల్ ఆఫ్ హెవెన్ పర్యటన, ఒక అధికారిక విందు ఉంటాయి. వాణిజ్యంతో పాటు ఇరాన్ యుద్ధం, తైవాను అమెరికా ఆయుధాల అమ్మకాల వరకు అనేక సున్నితమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.

Leave a Reply