19th Season | తొలి పోరులో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ ఢీ

19th Season | తొలి పోరులో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ ఢీ
19th Season | ఇరుజట్లకు బలమైన బ్యాటింగ్
బౌలింగ్‌లో రెండు టీంలు వీక్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
రాత్రి 7.30గంటలకు ప్రారంభం
19th Season | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వచ్చేసింది. 19వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొననున్నాయి. తమ విధ్వంసాలను ప్రదర్శించడానికి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఎస్ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా కాగా, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు.
19th Season | సన్‌రైజర్స్ హైదరాబాద్…
సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం బ్యాటింగే. ఈ జట్టుకు ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలాంటి బౌలింగ్‌నైనా చీల్చి చెండాడగలరు. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. అలాగే లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, సలీల్ అరోరా లాంటి హిట్టర్లు ఉన్నారు. హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ విషయంలో సమస్య లేకున్నా.. బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. మహమ్మద్ షమీ జట్టును వీడటంతో పేస్ విభాగం కొంత బలహీనపడింది. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని పేస్ దళంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి, బ్రైడన్ కార్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అగ్రశ్రేణి జట్లలా స్థిరంగా వికెట్లు పడగొట్టే సామర్థ్యం వీరిలో ఎంతమందికి ఉందనేది ప్రశ్నార్థకమే. స్పిన్ విభాగం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, కమిందు మెండిస్ వంటి పెద్దగా అనుభవం లేని స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.

19th Season | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌కి సన్నద్ధమవుతోంది. ఆర్సీబీకి జోష్ హేజిల్‌వుడ్ దూరమవ్వడం కాస్తంత కంగారు పెడుతున్నా.. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం జట్టును ముందుకు నడిపించనుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఈ ఏడాది ఆర్సీబీ జట్టు కనిపిస్తోంది. ఆర్సీబీకి బలమైన హిట్టర్లు ఉండటం కలిసొచ్చే అంశం. విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, పడిక్కల్, మిడిలార్డర్‌లో కెప్టెన్ రజత్ పటిదార్, చివర్లో జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా ఉండటం చాటా పటిష్టంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఆరంభ మ్యాచులకు దూరం కాగా, యశ్ దయాల్ ఈ సీజన్ మొత్తానికే అందుబాటులో లేడు. శ్రీలంక బౌలర్ నువాన్ తుషార ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అవ్వడం ఆ జట్టును మరింత దెబ్బతీసింది. దీంతో బౌలింగ్ భారాన్ని భువనేశ్వర్ కుమార్, సుయశ్ శర్మ, జాకబ్ డఫీ మోయాల్సి ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్‌లపైనే జట్టు ఆశలు పెట్టుకుంది.

ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ 11 :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్ లేదా టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయశ్ శర్మ, జాకబ్ డఫీ, రసిఖ్ సలామ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):
ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్ లేదా ఇషాన్ మలింగా, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష దూబే, బ్రైడన్ కార్సే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
హెడ్ టు హెడ్ రికార్డు
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 సార్లు ఎదురుపడ్డాయి. ఆర్సీబీ గెలిచిన మ్యాచ్‌లు 11 కాగా, హైదరాబాద్ గెలిచిన మ్యాచ్‌లు 13 ఉన్నాయి.
రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు.
పిచ్ రిపోర్ట్
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదవుతాయి. బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటర్లకు పరుగులు భారీగా చేయగలరు.
వాతావరణం
మ్యాచ్ సాయంత్రం 7:30కి ప్రారంభమవుతుంది. వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువ.
