ఘనంగా బక్రీద్ వేడుకలు..

ఘనంగా బక్రీద్ వేడుకలు..

  • ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శుభాకాంక్షలు

నాగర్‌కర్నూల్ ,ఆంధ్రప్రభ : ఇస్లాం మతానికి మూలస్తంభాలైన ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ సూత్రాలను పాటిస్తూ ముస్లింలు సోదర భావంతో ముందుకు సాగుతూ పండుగలను జరుపుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు.

గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళిని జాగృతపరచి, మనలోని త్యాగనిరతిని చాటిచెప్పే పవిత్రమైన ఈ బక్రీద్ వేడుకను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, స్థానిక కౌన్సిలర్లు, మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply