గుంటూరులో క‌ల‌క‌లం

గుంటూరులో క‌ల‌క‌లం

  • సోష‌ల్ మీడియాలో మున్సిపల్ ఉద్యోగి సెల్ఫీ వీడియో పోస్ట్
  • ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అప్కాస్ ఉద్యోగి ఉదయ్‌చంద్ర ఆత్మహత్యాయత్నం సంచ‌ల‌నంగా మారింది. “ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో వేధింపులకు గురి చేస్తున్నాడు, దుర్భాషలాడాడు. నా చావుకు మధునే కారణం” అని ఉదయ్‌చంద్ర సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. సమయానికి స్నేహితులు అడ్డుకోవడంతో ఉదయ్‌చంద్ర ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఏఈ మధుసూదన్‌రావు వివరణ ఇచ్చారు.

గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్‌చంద్ర పనితీరుపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. లైట్ల నిర్వహణ, ఫోన్లకు స్పందనపై కార్పొరేటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.ఈ నేపథ్యంలో కొంతకాలం విధుల నుంచి తప్పించి, తరువాత బుడంపాడు లైట్ల ఆన్/ఆఫ్ బాధ్యతలు అప్పగించామని వివరించారు. కానీ కొత్త విధులకు హాజరు కాకపోవడంతో ప్రశ్నించగా, ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరించాడని తెలిపారు. ఈ ఘటనపై మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చ జ‌రుగుతోంది.