జిల్లా ఉప సర్పంచుల ఫోరం కార్యదర్శిగా మహ్మద్ ముబీన్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్‌లో నిర్వహించిన జిల్లా ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నికల్లో ఉట్నూర్ మండలంలోని దంతాన్‌పల్లి ఉప సర్పంచ్ మహ్మద్ ముబీన్‌ను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మహ్మద్ ముబీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని చెప్పారు.
గ్రామాల అభివృద్ధితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కార్తీక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు జంపన్నతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
