ప్రతి 90 రోజులకు పోలీసు వాహనాల తనిఖీ

అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా నిర్వహణ చర్యలు

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి 90 రోజులకు ఒకసారి పోలీసు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఏఆర్‌ఎస్‌ఐ బాల కోటేశ్వరరావు తెలిపారు.

ఎస్పీ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వాహనాల పనితీరును పరిశీలించి, అవసరమైన మరమ్మతులను గుర్తిస్తున్నారని చెప్పారు. అనంతరం ఎస్పీ అనుమతితో ఆథరైజ్డ్ లేదా ప్రైవేట్ వర్క్‌షాపుల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా పనిచేసేలా ఈ తనిఖీ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బాపట్ల మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న కుమార్ పోలీసు వాహనాలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులపై సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు ఏఆర్‌ఎస్‌ఐ బాల కోటేశ్వరరావు తెలిపారు.