ADB | బుగ్గగూడెంలో పులి కలకలం… అడుగుల గుర్తింపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన
బెల్లంపల్లి, జనవరి 31 (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి మండలంలోని కన్నాల బుగ్గగూడెంకు వెళ్లే దారిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు శుక్రవారం ఉదయం తెలపడంతో అటవీ క్షేత్ర అధికారి పూర్ణచందర్ అధికారులతో కలిసి పులి అడుగులను గుర్తించారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బుగ్గ దేవాలయాల దారిలో వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పెద్దపులి కదలికలు ఏమైనా తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలపాలని కోరారు. రేంజర్ వెంట డిప్యూటీ రేంజర్లు సతీష్, ప్రవీణ్ నాయక్ అటవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.