నరసరావుపేటలోని స్టేడియంలో ఆటకు రేటు

నరసరావుపేటలోని స్టేడియంలో ఆటకు రేటు
యూజర్ చార్జీలతో ఆటగాళ్ల నడ్డి విరుస్తున్న
స్పోర్ట్స్ అథారిటీ
గత రెండు నెలలుగా మూసివేసిన* జిమ్, *షటిల్ కోర్ట్, రెండేళ్లుగా స్విమ్మింగ్ పూల్
క్రీడల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట, ఆంధ్రప్రభ : డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం లో ఆటలాడుకునే వారి వద్ద నుంచి వేల రూపాయల యూజర్ చార్జీలు దండుకుంటున్నారనే సమాచారంతో నరసరావుపేట డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే స్టేడియంను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సందర్శించి అక్కడ అంతా కలయ దిరిగారు.అక్కడ క్రీడాకారులతో మాట్లాడారు. మూతపడ్డ జిమ్, షటిల్ పాయింట్స్ ను, స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారు స్టేడియంలో యూజర్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ఇక్కడి స్టేడియం మైదానంలో పిల్లలు ఆటలు ఆడుకోవాలంటే నెలకు ₹రు.2,500 కట్టాల్సిన దుస్థితి ఆటగాళ్లకు ఏర్పడిందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా స్విమ్మింగ్ పూల్ మరమ్మతులు చేయకుండా నిర్వీర్యం చేశారని, రెండు నెలలుగా జిమ్ పాయింట్,షటిల్ కోర్టును మూసివేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం స్టేడియం ను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత పాతిక సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా స్టేడియంలో క్రికెట్, ఇతర ఆడుకునే వారి వద్ద నుంచి యూజర్ చార్జీల పేరుతో 2,500రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇది దారుణమైన విషయమని అంబరు. ఆటగాళ్లకు ప్రోత్సాహాలు అందించి స్పోర్ట్స్ ను ప్రోత్సహించాల్సినది పోయి వారి వద్ద నుంచే డబ్బులు వసూలు చేయడం అన్యాయం అన్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో ఒక్క రూపాయి కూడా యూజర్ చార్జీలు వసూలు చేయకుండా ఆటగాళ్లని ప్రోత్సహించామని, ప్రస్తుతం స్టేడియం ఇన్చార్జిగా వచ్చిన నరసింహారెడ్డి అనే వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వం లో కూడా ఇక్కడ కు వచ్చి యూజర్ చార్జీలు వసూలు చేయాలని చూశాడని తక్షణమే స్పందించిన మేము అప్పుడు అతనిని వెనక్కి పంపడం జరిగిందని గుర్తు చేసారు.అయితే అదే వ్యక్తి తిరిగి ఇప్పుడు స్టేడియం ఇన్చార్జిగా వచ్చి యూజర్ చార్జీలు పెట్టి స్టేడియం ను నిర్విరం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ,స్థానిక ప్రజాప్రతినిధి, కలెక్టర్ స్పందించి యూజర్ చార్జీలు లేకుండా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల కాలం అయినప్పటికీ ఎందుకు స్విమ్మింగ్ పూల్ ప్రారంభించలేకపోయారని ?ప్రశ్నించారు.గొప్పలు చెబుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగడం లేదని గోపిరెడ్డి విమర్శించారు.
ఏపీ లోనే చమురు ధరలు
,దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కొరత లేదని, కేవలం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు?
కేవలం కూటమి ప్రభుత్వ చేతకానితనం వల్లనే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందని, మంత్రులందరూ సింగపూర్ కు వెళ్లారని, వారం రోజులుగా లోకేష్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదని అన్నారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ అందుబాటులో లేదని ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని తీవ్రంగా విమర్శించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా ఆటగాళ్లకు స్టేడియంలో ఆడుకునే స్వేచ్ఛను కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

