MLA | సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధ‌న‌తో పుణ్యఫలం

MLA | సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధ‌న‌తో పుణ్యఫలం

MLA | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కార్తికేయ స్వామిని ఆరాధించడం అత్యంత పుణ్యఫలం ల‌భిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(MLA Pulaparthi Ramanjaneyu) (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం గొల్లవాని తిప్ప గ్రామంలోని శ్రీవల్లి సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి(Srisubrahmanyeshwar Swamy)వార్ల వార్షిక కల్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ముందుగా స్వామివారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. శివ పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానం, ధైర్యం, సంతానం ప్రసాదించే భగవంతుడని, స్వామిని పూజిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోయి కోరిన కోర్కెలు తీరుతాయ‌న్నారు.

ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు(MLA Anjibabu)ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.