Gudlavalleru | ధాన్యపు రాశుల ప‌రిశీల‌న

Gudlavalleru | ధాన్యపు రాశుల ప‌రిశీల‌న

Gudlavalleru | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : వేమవరపాలెం (Vemavarapalem) గ్రామానికి సమీపంలో పెడన–గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను కలెక్టర్ డీకే బాలాజీ (DK Balaji) పరిశీలించారు. కలెక్టర్ బుధవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆగి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

గుడ్లవల్లేరు (Vemavarapalem) మండలం వేమవరపాలెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం, ఎకరం 50 సెంట్ల పొలంలో పండించిన ఎంటీయూ 1318 రకం ధాన్యం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిన్న మంగళవారం వరి కోత యంత్రంతో కోత కోసి ధాన్యాన్ని ఆరబెట్టానని, అయితే ఇటీవలి తుపానుకు చేను ఈత ఈనిందని, ఆ సమయంలో వర్షాలకు తడవడం వల్ల మానుగాయ తెగులు వచ్చిందని రైతు క‌లెక్ట‌ర్‌కు వివరించారు.

Leave a Reply