Decision | డీలర్ల నిరసన..

Decision | డీలర్ల నిరసన..
Decision | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలు బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతులు, డీలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద కంపెనీల పెత్తనానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు కొన్ని కంపెనీలకు కొమ్ముకాసేలా ఉన్నాయని డీలర్లు మండిపడుతున్నారు. రైతులకు సరైన ధరలకు ఎరువులు, పురుగుమందులు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిపోయి, హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా మారే పరిస్థితిని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు.
పెద్ద కంపెనీల ఆధిపత్యం తగ్గించి, చిన్న డీలర్లను రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు తాత్కాలిక అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది.
