రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొండ తెంబూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం వేకు వఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు కూరగాయల లోడుతో వెళుతున్న బొలెరో వ్యాన్ అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్ లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఒడిశా కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Leave a Reply