నాగర్ కర్నూల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి…

నాగర్ కర్నూల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి…

ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రస్తావించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ,దీనితో పాటు ట్రాఫిక్ సమస్యలు, ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా గణనీయంగా పెరిగాయని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ని కలిసి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ముఖ్యమంత్రి జారీ చేయడం జరిగిందని తెలిపారు.


దాని అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేసి పనులు మొదలు పెట్టాలి అని కోరారు అలాగే, ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు మరియు మిషన్ భగీరథ అధికారుల సమన్వయంతో నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సంబంధిత మంత్రిని కోరారు.