అగ్గిపెట్టె మీద సూక్ష్మ చిత్రాలతో రామాయణం…

అగ్గిపెట్టె మీద సూక్ష్మ చిత్రాలతో రామాయణం…

శ్రీరామనవమి ప్రత్యేక రామునికి అంకితం…
ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వింటే రామాయణం కథ వినాలి…తింటే గారెలే తినాలి…అనే సామెత పురాణ కాలం నుంచి ఉంది. ఇందుకు నిదర్శనంగా రామాయణం గురించి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని చిన్న అగ్గిపెట్టె మీద మైక్రో పెన్నుతో, మైక్రోబ్రష్ లతో వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో మూడు గంటల సమయంలోనే రామాయణం లోని ప్రధాన ఘట్టాలు వేసి అందరిని ఆశ్చర్య చకితులను చేశారు.కేవలం రెండు ఇంచెస్ పొడవు, రెండున్నర ఇంచెస్ వెడల్పు గల అగ్గిపెట్టె పై ఇంచెస్ అంటే అంగుళాలు ఆయన ఉహాలో మె దిలే రామాయణంలోని ప్రధాన అంశాలు వేసానని తెలిపారు.

ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ నేను వేసిన ఈ చిత్రం లో శ్రీరాముని జననం నుండి సీతా దేవి అగ్ని పరీక్ష వరకు వుంటుందన్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే త్రేత యుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకు, కౌసల్య కు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, పురు షోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శ ప్రాయుడు, పితృ వాక్యపరిపాలకుడు. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు. ఏకపత్ని వ్రతుడు. సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. ప్రజలను కన్న బిడ్డలాగ చూసుకునేవారు.

శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. కాబట్టి అందరికి ఆదర్శప్రాయుడు. అందుకే రామాయణం గురించి ఎన్ని సార్లు విన్న, రామాయణం గురించి ఎన్ని సార్లు బొమ్మలు వేసిన తనివి తీరదు.నేను వేసిన ఈ చిత్రంలో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు తమ పిల్లలైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలను ముద్దాడు తున్నట్లు, రామ, లక్ష్మణులు విశ్వామిత్రుని దగ్గర శిష్యరికంలో వున్నట్లు, యజ్ఞం భంగం చేస్తున్న రాక్షసులను రామలక్ష్మణులు సంహారిస్తున్నట్లు, అహల్య శాప విమోచన, రాముడు శివ ధనుస్సు విరిచినట్లు, సీతారాముల కళ్యాణం, తండ్రి దగ్గర సెలవు తీసుకొని వనవాసం వెళుతున్న రామ, లక్ష్మణ, సీతమ్మ, రాముని పాదరక్షలు తీసుకుంటున్న భరతుడు, రామునికి జింకను చూపిస్తున్న సీతమ్మ, మారు వేషంలో రావణుడు, సీతాదేవిని అపహారించి పోతున్నప్పుడు సీతమ్మ కాపాడుట కోసం జటాయువు అనే పక్షి అడ్డం వస్తే దాన్ని రెక్కలు రావణుడు నరుకుతున్నట్లు, రామునికి ప్రేమతో పళ్ళు తినిపిస్తున్న శబరి,వాలి సంహారం, సీతమ్మ జాడ కోసం హనుమంతుడు ఆకాశంలో పోతున్నట్లు, సీతా దేవి ఇచ్చిన చూడామణిని హునుమ తీసుకున్నట్లు, లంకా దహనం, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులతో యుద్ధం చేస్తున్న రామలక్ష్మణులు, యుద్ధంలో మూర్ఛ పోయిన లక్ష్మణుడు, సంజీవ పర్వతం తెస్తున్న హనుమాన్, రామ రావణ యుద్ధంలో రావణుడి సంహారం, అగ్ని పరీక్షలో మహా సాద్వి సీతమ్మ వున్నట్లు ఇలా ఇన్ని ప్రధాన ఘట్టాలను చిన్న అగ్గిపెట్టె పై వేసాను. శ్రీరాముని మీద వున్నా భక్తితో ఈ చిత్రం వేసాను. భక్తులందరికి ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీరామనవమి పండుగకి రామునికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply