ఇంటింటి ప్రచారంలో మంత్రి వాకిటి సతీమణి లలిత
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వాకిటి మానస హన్మంతు ను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి మాజీ ఎంపిటిసి లలిత శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వార్డు పరిధిలో మానస హన్మంతు కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రాంత బిడ్డ అన్నది మీ అందరికీ తెలుసని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మానసా హన్మంతు ను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ మధ్యకాలంలో మంత్రిగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు అన్నారు.
అభివృద్ధిని కొనసాగించడానికి మరింత అభివృద్ధి సాధించాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు .అందుకు ప్రతి వార్డులోను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మక్తల్ ప్రజలపై ఉందన్నారు. మున్సిపాలిటీలో అధికారం చేపట్టాలంటే 14వ వార్డు కూడా ఎంతో కీలకమైనదని అన్నారు. అందుకే ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి వాకిటి మానస హన్మంతు ను భారీ మెజారిటీతో గెలిపించవలసినదిగా మంత్రి సతీమణి లలిత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫయాజ్ ,వాకిటి శ్యామ్, బి. రమేష్, వాకిటి కిష్టప్ప ,డి .రమేష్, రాజు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, నాగు, నాగరాజ్, ఏఎంసి డైరెక్టర్ అంజి తదితరులు పాల్గొన్నారు.
