Rajya Sabha | కూటమి మద్దతుతో రాజ్యసభకు లింగమనేని రమేష్

Rajya Sabha | కూటమి మద్దతుతో రాజ్యసభకు లింగమనేని రమేష్

Rajya Sabha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇవాళ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేల సమక్షంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

లింగమనేని రమేష్ నామినేషన్‌కు ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. కూటమి ఐక్యతకు ప్రతీకగా ఈ నామినేషన్ ప్రక్రియ సాగింది.

రమేష్ వెంట జనసేన ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు తదితరులు హాజరయ్యారు. కూటమి తరఫున ఆయన విజయం ఖాయమనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

Leave a Reply