లాజిస్టిక్ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లాజిస్టిక్ హబ్‌గా ఉత్తరాంధ్ర..

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని వి.ఏం.ఆర్.డి.ఏ కార్యాలయంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తాత్కాలిక భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లతో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుత స్థితి గురించి ఈ సమీక్షలో చర్చించారు.

కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఆలోచనలను ఈ సంధర్భంగా పంచుకున్నారు. ఉత్తరాంధ్ర లోని రైల్వే ప్రాజెక్టులను, తీరప్రాంత రవాణాను అనుసంధానం చేసుకుని లాజిస్టిక్ హబ్ గా మార్చే దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలను చేసినట్లు మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.