క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి : జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని చిన్నప్పటినుండే క్రీడలపై ఆసక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండ శ్రీ కరి బసవప్ప జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అనంతపురం స్పోర్ట్స్ చాంపియన్షిప్ లో విద్యార్థులు, ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అలాగే మండల స్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకు పోటీల్లో ఆసక్తి చూపుతున్నారని క్రీడలో ఆడడం వల్ల పోటీ తత్వం పెరుగుతుందన్నారు.
ప్రభుత్వం కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను క్రీడల పట్ల వారిని ప్రోత్సహించా లన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల మంది బాల బాలికలు ఈ యొక్క మండల స్థాయి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందన్నారు. అలాగే నియోజకవర్గ నుంచి 200 నుండి 300 వరకు జిల్లాస్థాయిలో 2000 పైగా పిల్లలు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా క్రీడాల శాఖ, విద్య స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ అలాగే ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు వీరందరి సహకారంతోనే ఈ క్రీడలో జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన బాల బాలికలకు జిల్లా కలెక్టర్ వారికి బహుమతి ప్రధానం చేశారు. నియోజకవర్గ పరిధి లోని ఆయా మండలాల వివిధ పాఠశాల నుండి 375మంది బాల బాలికలు (అండర్ 14) క్రీడా పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఖో ఖో విన్నర్స్ గా ఉరవకొండ బాలికలు కాగా రన్నర్స్ గా వజ్రకరూర్ విద్యార్థులు నిలిచారు.
బాలురలో వజ్రకరూర్ విన్నర్స్ గా ఉరవకొండ రన్నర్స్ ఉన్నారు. వాలీబాల్ బాలురలో ఉరవకొండ విన్నర్స్ రన్నర్స్గా వజ్రకరూరు, బాలికల్లో బెలుగుప్ప విన్నర్స్ విడపనకల్లు రన్నర్స్, కబడ్డీలో బాలురు విడప నకల్లు విన్నర్స్ వజ్రకరూరు రన్నర్స్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మంజుల, తాసిల్దార్ అరుణ, ఎంపీడీవో రవి ప్రసాద్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసులు, హెడ్మాస్టర్ సత్యనారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ షాషావలి, పి డి మారుతి ప్రసాద్ పాల్గొన్నారు
