Minister | అప్రమత్తంగా ఉండండి..

Minister | అప్రమత్తంగా ఉండండి..
వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం..
Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎండలు, వడగాలుల పరిస్థితిపై ఆయన ఇవాళ అత్యవసర సమీక్ష నిర్వహించారు.
వృద్ధులు, చిన్నారులు అత్యవసరమైతేనే బయటకు రావాలని మంత్రి సూచించారు. తీవ్ర ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న వేళల్లో బయట సంచారం తగ్గించాలని తెలిపారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని వెల్లడించారు.
