Meeting | అండగా ఉంటా.. అధైర్య పడొద్దు

Meeting | అండగా ఉంటా.. అధైర్య పడొద్దు
- పెంచలయ్య కుటుంబంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకాంత భేటీ
- కుటుంబ పోషణకి సొంతంగా రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందజేత
- పెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను తీసుకున్న కోటంరెడ్డి కుమార్తెలు
- భావితరాలకు గుర్తుండేలా పెంచలయ్య విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేస్తాం
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Meeting | నెల్లూరు (రూరల్), ఆంధ్రప్రభ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న ఆర్టీడీటీ కాలనీ(RTDT Colony)లో గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి ముఠా చేతుల్లో హత్యకు గురైన పెంచలయ్య(grow up) కుటుంబంతో బుధవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు సీపీఎం నాయకులతో కలిసి ఏకాంతంగా భేటీ(Private meeting) అయ్యారు.
పెంచలయ్య కుటుంబానికి రూరల్ టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పెంచలయ్య కుమారులు తాము ఐఏఎస్, ఐపీఎస్ కావాలని తమ నాన్న కోరిక అని, తమకు అండగా నిలిస్తే కష్టించి చదివి తమ తండ్రి కోరికను తీర్చి, సమాజానికి(to society) ఉపయోగపడతామని తెలియజేశారు. దీంతో స్పందించిన కోటంరెడ్డి.. తన కుమార్తెలు హైందవి, వైష్ణవిలకు ఫోన్ చేసి, పెంచలయ్య ఇద్దరు కుమారుల బాధ్యత(Responsibility of sons) చెరొకరు చేపట్టాలని కోరారు.
తమ తండ్రి కోరిక మేరకు ఇప్పటికే తాము కొంత మందిని చదివిస్తున్నామని, ఆ ఇద్దరి బిడ్డల ఉన్నత చదువుల బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెంచలయ్య కుమారులు ఒకరు 9, మరొకరు 5వ తరగతి చదువుతున్నారని, 10వ తరగతి వరకు వీరిద్దరికి ఉచితంగా చదువులు అందిస్తామని తెలియజేసిన మైథిలి స్కూల్(Maithili School) యాజమాన్యానికి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే(Rural MLA) ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్డీటీ కాలనీలో కొంత మేర కనీస వసతులు కల్పించామని, మరికొన్ని వసతుల కోసం(For facilities) వారం రోజుల్లో రూ. 50 లక్షల నిధులు మంజూరు చేయిస్తామన్నారు.
గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య చేసిన పోరాటం భావితరాలకు స్పూర్తినిచ్చిందని, ఆయన విగ్రహాన్ని కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. హంతకులకు కఠినంగా శిక్షలు(Severe punishments) పడేవిధంగా తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. గంజాయి మూకలపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు(People of the state) అండగా నిలవాలని కోరారు. పెంచలయ్య కుటుంబానికి అండగా నిలిచిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆయన కుమార్తెలకు సీపీఎం నేత, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
