తుమ్మల క్యాంప్ ఆఫీస్ లో మీనాక్షి నటరాజన్‌, మహేష్‌కుమార్‌గౌడ్‌…

ఖమ్మం, (ఆంధ్రప్రభ): కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ఆదివారం మంత్రి తుమ్మల క్యాంప్‌ కార్యాలయానికి విచ్చేశారు. ఆమెతో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్‌ కార్యాలయానికి విచ్చేశారు.

దీంతో తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్‌ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల కోలాహల వాతావరణంగా తుమ్మల క్యాంప్‌ కార్యాలయం మారింది. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి తేనేటి విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులను మీనాక్షి నటరాజన్‌, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు పరిచయం చేశారు.

క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా నాయకులను కార్యకర్తల కోలాహలం చూసి భవిష్యత్తులో రానున్న అన్ని ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని పట్టం కడతారని ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా నాయకులు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వారితో ఫొటోలు దిగారు. దీంతో తుమ్మల క్యాంప్‌ కార్యాలయం వద్ద సందడి వాతావరణంగా మారింది. వారిని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్‌ సాదరంగా స్వాగతించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు.