medical | విద్యార్థికి ఆర్థిక సాయం

medical | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : వైద్య విద్యను అభ్యసిస్తున్న శ్రీలేఖకు జనసేన పార్టీ ఇన్‌చార్జి బండి రామకృష్ణ రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ.. బందరు మండలం క్యాంబెల్ పేటకు చెందిన పెదశింగు రాము కుమార్తె శ్రీలేఖ అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం దంత వైద్యను అభ్యసిస్తుందని తెలిపారు.శ్రీలేఖ వైద్య విద్యను అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజానికి తన వైద్యవృత్తి ద్వార సేవలు అందించాలని ఆకాంక్షించారు. పేదవారికి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరానన్నారు.

Leave a Reply