Medaram | భారీ వృక్షాల కూల్చివేత…
Medaram | భారీ వృక్షాల కూల్చివేత…
Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మేడారం(Medaram) మహా జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా భారీ వృక్షాలను కూల్చివేస్తున్నారు. దశాబ్దాలుగా పెంచిన చెట్లు గొడ్డలి వేటుకు బలవుతున్నాయి. మాస్టర్ ప్లాన్(Master plan)లో భాగంగా శాశ్వత పనులు చేపడుతుండటంతో గద్దెల నుంచి ఆర్టీసీ క్రాస్(RTC Cross) వరకు ఇరువైపుల ఉన్న భారీ వృక్షాలను కూల్చుతున్నారు.
ఇన్నాళ్లు భక్తులు వంటలు చేసుకొని పిల్ల పాపలతో ఉత్సాహంగా గడిపిన క్షణాలను భక్తులు కూల్చిన చెట్లను చూసి గుర్తు చేసుకుంటున్నారు. దశబ్దాలుగా నీడను ఇచ్చిన చెట్లను మొత్తానికి నరకకుండా ఈ చెట్లను పెకిలించి నాటాలని, పర్యావరణాన్ని కాపాడాల్సిన వారే ఈ చెట్లను నరకడం పట్ల పర్యావరణ ప్రేమికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
