42 ఏళ్ల దోస్తానం.. గురుశిష్యుల ఆత్మీయ కలయిక

  • పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదికగా మారిన మేడపల్లి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నాలుగు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న బాల్యమిత్రులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడినా స్నేహబంధాన్ని కొనసాగిస్తూ మళ్లీ ఒక్కటయ్యారు. నాటి గురువులను కలుసుకుని ఆశీస్సులు అందుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలోని యశోద ఫంక్షన్‌హాల్‌లో మేడపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 1984–85 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన పూర్వ విద్యార్థులు చదువు, ఆటపాటలు, స్నేహాలు, గురువుల మందలింపులు, వారు నేర్పిన క్రమశిక్షణ, సంస్కారాన్ని గుర్తుచేసుకున్నారు. 42 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన మిత్రులు చిన్ననాటి మాదిరిగానే సరదాగా ముచ్చటించుకుంటూ ఆనందంగా గడిపారు.

కార్యక్రమానికి నాటి ఉపాధ్యాయులు పి. పోచయ్య, జి. నర్సింహారెడ్డి, పి. సమ్మయ్య, యు. ఋషి, చౌహాన్, ఎం. కుమారస్వామి, సెట్రామ్ తదితరులు హాజరయ్యారు. వారిని పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా పలకరించి ఆశీస్సులు తీసుకున్నారు. తమ జీవితాల్లో ఎదగడానికి ఉపాధ్యాయులు అందించిన విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.

1984–85 బ్యాచ్‌కు చెందిన పలువురు ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దూరంగా ఉన్నప్పటికీ ఈ కలయిక కోసం అమెరికాలోని పోలపెల్లి తిరుపతిరెడ్డి రూ.10 వేలు, సత్యన్న రూ.5 వేలు సహకారం అందించారు.

కార్యక్రమంలో మంచికంటి సుకన్య, దొంతి తిరుపతమ్మ, గుండపనేని జ్యోతి, పల్లె మంజుల శ్రీదేవి, స్వరూప, తాళ్లపెల్లి చంద్రమౌళిగౌడ్, పల్లె మహేందర్‌రెడ్డి, బచ్చు వెంకటేశ్వర్‌రావు, పెరమాండ్ల ఉపేందర్‌గౌడ్, తడక రమేష్‌గౌడ్, తోటకూరి వెంకటేశ్వర్లు గౌడ్, మామిండ్ల మోహన్‌రెడ్డి, సంధినేని సత్యనారాయణరావు, కళింగరావు, కుడుతాల వీరన్న, అడుప నర్సింగరావు, మాసన సదానందం, అనుముల కుమారస్వామి, పిట్టల రవీందర్, నంగునూరి నందం, నంగునూరి మల్లాచారి, ఎన్నమనేని స్వామిరావు, ఎన్నమనేని దేవేందర్‌రావు, రామచంద్రుని రవీందర్‌రావు, ఉల్లెంగుల చంద్రమౌళి, ఊరటి మల్లారెడ్డి, ఎం.డి. అక్బర్‌పాషా, కాందాల రమణ, గణపతి తదితరులు పాల్గొన్నారు.