ఉద్యోగార్థులకు జాబ్ డ్రైవ్
ఆగస్టు 22న కలెక్టరేట్‌లో నిర్వహణ
కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మరో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాయలసీమ ఆల్కలీస్, ఫ్రెష్ బౌల్, జైరాజ్ ఇస్పాత్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 22న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జాబ్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆవిష్కరించారు.
జిల్లాలోని ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి జాబ్ డ్రైవ్‌లు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగాల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, వేతన వివరాలు తదితర పూర్తి వివరాలను జాబ్ డ్రైవ్ నిర్వాహకులు, సంబంధిత అధికారులు వెల్లడించాల్సి ఉంది.
