కళ్యాణలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ ధర్నా
- కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో
కడెం, ఆంధ్రప్రభ: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కడెం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు.
కడెం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అనంతరం కడెం మండల తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడెం మండల మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు, లింగాపూర్, దిల్దార్‌నగర్, నవాబ్‌పేట్, కొండుకూర్ సర్పంచులు కుమ్మరి రంజిత్‌కుమార్, బి. స్టీఫెన్, జుట్టు శంకరయ్య, భీమేష్, ఖానాపూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కె. సతీష్, పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ కాశవేణి విజయ్‌యాదవ్, సీనియర్ నాయకులు ఇస్లావత్ గంగన్న, మామిడిపల్లి రాజేశ్వర్‌గౌడ్, ముబారక్జీ వేణుగోపాల్‌నాయక్, కె. మల్లేష్, ఎండి హసీబ్, కళ్లెం తిరుపతిరెడ్డి, చిట్యాల రవి, శనిగరపు రాజేశ్వర్, తిరుపతి, జగన్, కుర్ర గంగాధర్, రమేష్‌నాయక్, సుగుణాకర్, మాజీ సర్పంచులు తిరుపతి, రత్నాల పోచన్నతో పాటు కోటయ్య, గంగాధర్‌నాయక్, చిట్టేటి ముత్తన్న, చంద్రబాస్, కత్తెరపాక రాజశేఖర్, కౌసర్, జుబేర్, రాజునాయక్, రాము తదితరులు పాల్గొన్నారు.
