may9match | ఐపీఎల్‌లో గుజ‌రాత్, రాజ‌స్థాన్ ఢీ

may9match | ఐపీఎల్‌లో గుజ‌రాత్, రాజ‌స్థాన్ ఢీ

may9match | ఇరుజ‌ట్ల‌కు గెలుపు త‌ప్ప‌నిస‌రి
రాజ‌స్థాన్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం
గత 5 మ్యాచుల్లో మూడింటిలో ఓటమి
హ్యాట్రిక్ విజయాలతో గుజరాత్ జోరు
ఈ రోజు గెలిస్తే టాప్‌4లోకి గుజ‌రాత్‌
జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో..
రాత్రి 7.30గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం

may9match | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ఇవాళ‌ మరో ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరుకు రంగం సిద్ధ‌మైంది. నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 7.30గంట‌ల‌కు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్ల‌కు కీల‌క‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క విజ‌యం సాధించాలి. ఈ తరుణంలో ఈ మ్యాచ్ హైటెన్ష‌న్ సాగే అవ‌కాశం ఉంది. జైపూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి, ఇరు జట్లలోని నాణ్యమైన స్పిన్నర్లు ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. రాజస్థాన్ తన హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో, గుజరాత్ వారి గెలుపు గుర్రాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. రాజస్థాన్‌కు నేటి విజయం అత్యంత అవసరం. ఆడిన గత ఐదు మ్యాచుల్లో మూడింటిలో ఓటమి పాలుకావడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. నేటి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం సాధిస్తే రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, తదుపరి ఆడబోయే మూడు మ్యాచుల్లో కనీసం రెండింటిలో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో గుజరాత్ టైటాన్స్ జోరు మీద ఉంది. వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్‌ను నమోదు చేసిన ఆ జట్టు, అదే ఊపుతో నేడు రాజస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ రోజు గెలిచి టాప్ 4లోకి వెళ్లాలని భావిస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మధ్యస్థానంలో ఉన్న గుజరాత్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా టాప్-4 లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న గుజరాత్, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మరో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద బలం.

Leave a Reply