రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఇటీవలే నియామకమైన చంద్రుపట్ల సునీల్ రెడ్డిని బిజెపి నాయకులు గురువారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీని స్థానికంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి అందర్నీ కలుపుకొని ముందుకెళ్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సదాశివ్, చిలువేరు సతిష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎల్కా సదానందం, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేపక శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కరెంగుల రాజశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సాదుల సురేష్, జెట్టి శంకర్, గురువేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply